Sun Mar 08 2026 15:23:26 GMT+0530 (India Standard Time)
జగన్ ఇంటి వద్దనే గోశాల
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గోశాలను ఏర్పాటు చేశారు. ఈ గోశాలను ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గోశాలను ఏర్పాటు చేశారు. ఈ గోశాలను ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. అధునాతన సౌకర్యాలతో గోశాలను ఏర్పాటు చేశారు. అన్ని వసతులు ఉన్న ఈ గోశాల ఆకట్టుకుంటోంది. దాదాపు పదిహేను మేలుజాతి ఆవులను ఈ గోశాలలో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.
అధునాతన సౌకర్యాలు....
గోశాలలో ఆవులు మూతి పెట్టిన వెంటనే నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. మేలురకమైన ఆవులను తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా గోశాలను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి జగన్ కోరిక మేరకు గోశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గోశాలను సందర్శించిన ముఖ్యమంత్ర జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Next Story

