Sun Mar 15 2026 11:11:51 GMT+0530 (India Standard Time)
ఏపీని సర్వనాశనం చేశారు : జగన్ ప్రభుత్వంపై గోరంట్ల విమర్శలు
పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారు? అని గోరంట్ల బుచ్చయ్చ చౌదరి జగన్ సర్కార్..

విజయవాడ : సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందని విమర్శించారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో గోరంట్ల మాట్లాడుతూ.. ఏపీలో ప్రాజెక్టుల పనులపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. పోలవరం పనులు ఎందుకు జరగడం లేదు ? ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారు? అని ఆయన నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు సాధించలేకపోతున్నారు? అని గోరంట్ల బుచ్చయ్చ చౌదరి జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. గత పథకాలకే పేర్లు మార్చి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప.. ప్రాజెక్టు పనులపై వైసీపీ మంత్రులకు ఏమాత్రం అవగాహ లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్ర స్థితిగతుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదని విమర్శించారు. కేవలం ఓట్ల గురించి మాత్రమే జగన్ ఆలోచిస్తున్నారని, ఇంత అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని ప్రజలు చెప్పుకుంటున్నారని గోరంట్ల పేర్కొన్నారు.
Next Story

