Thu Mar 19 2026 17:40:39 GMT+0530 (India Standard Time)
తొమ్మిది రైళ్లు రద్దు.. కారణమిదే
రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకే ట్రాక్ తో రైళ్ల రాకపోకలను అనుమతిస్తున్నారు. గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడంతో తొమ్మిది రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
గూడ్స్ రైలు పట్టాలు...
గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వెనక కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో వెంటనే సహాయక చర్యలను రైల్వే శాఖ ప్రారంభించింది. ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story

