Sat Dec 13 2025 22:34:11 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం ఇన్ఫోసిస్ తో కలిసి పనిచేయనుంది. దీనిని 'ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డు' స్కీమ్‌గా అమలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం ముఖ్య ఉద్దేశ్యంగా ఈ ప్రాజెక్టు చేపట్లారు తొలి విడతగా ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.
విద్యార్థులకు ట్యాబ్ లు...
దీని ఫలితాల ఆధారంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు కార్యాచరణ సిద్ధం అవుతోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఇన్ఫోసిస్ సంస్థ మంగళగిరిలోని 38 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఒక్కొక్క దానికి 30 ట్యాబ్‌లను అందించనుంది. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ట్యాబ్ లు అందుకోనున్నారు. ఉపాధ్యాయులు సైతం డిజిటల్ విధానంలో బోధన చేస్తారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు డిజిటల్ విద్య పైన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ట్యాబ్ లను గణితం, సైన్స్, ఇంగ్లీష్, మరియు జీవన నైపుణ్యాలు వంటి సబ్జెక్టులను బోధించడానికి ఉపయోగిస్తారు.
Next Story

