Sat Oct 12 2024 05:47:14 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయింది.
ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయింది. డీఎస్సీ నోటిఫికేషన్ ను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ను ఆయన విడుదల చేశారు. ఇందులో 2,280 ఎస్జిటిలు, స్కూల్ అసిస్టెంట్స్ 2,299 , 1,264- టిజిటిలు, 215 - పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6,100 పోస్టులున్నాయి. ఈరోజు నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు గా తెలిపారు. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలుంటాయి.
రెండు విడతలుగా...
ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు ఒక విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత గా పరీక్షలు నిర్వహించనున్నారు. 31 వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణలు చేస్తారు. ఏప్రిల్ 2 న ఫైనల్ కీ విడుదలవుతుంది. ఏప్రియల్ 7 న డీఎస్సీ ఫలితాలు విడుదలవుతాయి. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Next Story