Sat Jan 31 2026 20:38:50 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని అమరావతి రైతులకు శుభవార్త
రాజధాని అమరావతి రైతులకు శుభవార్త అందింది

రాజధాని అమరావతి రైతులకు శుభవార్త అందింది.నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి, ఆంధ్రప్రదేశ్, సమావేశం లో సీఆర్డీడీఏ కమిషనర్ డాక్టర్ మాదల వాసు మరియు అమరావతి రైతుల అభ్యర్థన మేరకు నివేశన, వాణిజ్య స్థలాలకు అన్ని రకాల రుణాలను ఇవ్వవలసిందిగా అన్ని జాతీయ బ్యాంకులకు సర్కులర్ పంపించడానికి నిర్ణయించారు.
బ్యాంకు రుణాలు...
ఇన్నిరోజుల నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములకు కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లను కేటాయించింది. అయితే దానిని అభివృద్ధి చేయకపోవడంతో బ్యాంకులు కూడా దానిపై రుణాలను ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. అయతే తాజాగా సమావేశం పెట్టి సూచించడంతో ఆ ప్లాట్లపై రుణాలు ఇచ్చేందుక బ్యాంకర్లు సిద్ధమయ్యారు. దీంతో అమరావతి కోసం భూములు ఇచ్చిన రాజధాని రైతులందరు అన్ని రకాల రుణాలను పొందవచ్చని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఏడాది ముందు రిజిస్టేషన్ జరిగిన ప్లాట్లకు మార్కెట్ రేటు ప్రకారం పరిగణనలోకి బ్యాంకర్లు తీసుకోనున్నారు
Next Story

