Thu Mar 19 2026 15:14:58 GMT+0530 (India Standard Time)
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ డీఏ 2019 జులై ఒకటోతేదీ నుంచి వర్తించనుందని పేర్కొంది. వచ్చే జనవరి నుంచి పెరిగిన డీఏను తీసుకోనున్నారు. డీఏ బకాయీలను వచ్చే జనవరి నుంచి మూడు విడతలుగా ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
గతంలో ప్రకటించిన విధంగానే....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన షెడ్యూల్ మేరకు డీఏను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో డీఏను విడుదల చేయడం విశేషం. పీఆర్సీపై కసరత్తు ఇంకా కొనసాగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story

