Thu Jan 29 2026 09:49:15 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం కానుంది

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కుప్పం నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇంటింటికి వెళ్లి...
గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించినా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలంటూ చంద్రబాబు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశఆరు. ఈ నేపథ్యంలో నేటి నుంచి నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం కానుండటంతో తెలుగుదేశం పార్టీ పండగలా జరపాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీలను ఏమేం అమలు చేశామన్నది? ఏం చేయబోతున్నది? ఇప్పటి వరకూ ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించనున్నారు.
Next Story

