Sat Apr 04 2026 02:50:06 GMT+0530 (India Standard Time)
జగన్ కు బైరెడ్డి వైరెటీ బర్త్ డే విషెస్
సముద్రం లోపలికి వెళ్లి బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి వైసీపీ నేతలు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వెరైటీగా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
సముద్రం లోపలికి వెళ్లి.....
సముద్రం లోపలికి వెళ్లి బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విశాఖలోని రుషికొండ బీచ్ లో స్కూబా డైవింగ్ చేసి జగన్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
Next Story

