Fri Dec 19 2025 17:07:43 GMT+0000 (Coordinated Universal Time)
జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో
జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అన్ని పిటీషన్లపై నేడు వాదనలను విననుంది.

జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ జీవో పై మరికొన్ని పిటీషన్లు దాఖలు కావడంతో నేడు వారి తరుపున వాదననలను కూడా ధర్మాసనం వినననుంది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వేసిన పిటీషన్లపై నేడు వాదనలు వింటారు. అలాగే ప్రభుత్వ వాదనను కూడా ధర్మాసనం వింటుంది.
స్టే నిన్నటి తో....
జీవో నెంబరు 1 పై స్టే నిన్నటి తో ముగిసింది. ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు విచారణ జరిపిన హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్న ఆసక్తి, ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. జీవో నెంబరు 1ను రద్దు చేయాలంటూ విపక్షాలు కోరుతుండగా, ప్రజల సంక్షేమం దృష్ట్యా జీవోను తెచ్చామని ప్రభుత్వం చెబుతుంది
Next Story

