Fri Dec 05 2025 13:17:15 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : నేడు శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి.. నీటి విడుదల
శ్రీశైలం జలాశయంలో నేడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు

శ్రీశైలం జలాశయంలో నేడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11.50 గంటలకు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లను ఎత్తడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి...
ప్రస్తుతం జలాశయంలో 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికే 192 టీఎంసీలు చేరాయి. దీంతో శ్రీశైలం జలాశయంలోని కొన్ని గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు
Next Story

