Thu Mar 19 2026 03:09:33 GMT+0530 (India Standard Time)
జగన్ పై గంటా చిందులు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎక్స్ లో ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో భూకబ్జాలు జరుగుతున్నాయని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. కనీసం కేంద్ర ప్రభుత్వానికి యాభై ఎకరాల భూమిని ఇచ్చి ఉంటే రైల్వే జోన్ వచ్చేది కదా? అని ప్రశ్నించారు.
కోట్ల విలువైన భూమిని...
లక్షల కోట్ల విలువైన భూమిని జగన్ సామంతరాజులు సొంతం చేసుకున్నారన్న గంటా శ్రీనివాసరావు వేల ఎకరాల భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. చరిత్రలో జగన్ విశాఖ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని చెప్పారు. వైసీపీ విముక్త విశాఖగా మార్చేందుకు జనం సిద్ధమయ్యారని గంటా శ్రీనివాసరావు అన్నారు.
Next Story

