Fri Dec 05 2025 12:02:01 GMT+0000 (Coordinated Universal Time)
వల్లభనేని వంశీ అరెస్ట్ పై యార్లగడ్డ సంచలన కామెంట్స్
వల్లభనేని వంశీ అరెస్ట్ పై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు.

వల్లభనేని వంశీ అరెస్ట్ పై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన అన్నింటినీ తప్పు అని ఒప్పుకోవాలని ఆయన అన్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. ఇంకా ఎన్నో కేసులు రాబోతున్నాయని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
ఆయనచేసిన వ్యాఖ్యలు...
అసెంబ్లీలోనూ, బయట వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని కూడా తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. వైసీపీ నేతలు వంశీ చేసిన తప్పులను ఖండించకపోగా సమర్థించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గాన్ని పదేళ్లలో భ్రష్టు పట్టించారని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. కేసులకు భయపడి ఎనిమిది నెలల నుంచి గన్నవరం నియోజకవర్గానికి వంశీ దూరంగా ఉన్నారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
Next Story

