Sun Mar 15 2026 09:04:47 GMT+0530 (India Standard Time)
పేరు మార్పుపై వంశీ అభ్యంతరం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి కొనసాగించాలని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వల్లనే హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు.
జిల్లాకు పేరు పెట్టడం...
అయితే ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. అయితే టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ వైసీపీ మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించడంపై ఆయన అభ్యంతరం తొలగించడంపై వైసీపీలోనే చర్చ జరుగుతుంది.
Next Story

