Sun Mar 15 2026 20:18:44 GMT+0530 (India Standard Time)
వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ విచారణ నేడు
నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది

నేడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు వల్లభనేని వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ కోసం ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి.
టీడీపీ కార్యాలయం...
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అసలు దేశంలో ఉన్నారా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వల్లభనేని వంశీ ముందస్తు ముందస్తు బెయిల్ పిటీషన్ నేడు విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. వంశీ తరుపున న్యాయవాదులు ఈ పిటీషన్ ను హైకోర్టులో వేశారు. ముందస్తు బెయిల్ వస్తుందా? రాదా? అన్న టెన్షన్ లో వంశీ అనుచరులున్నారు.
Next Story

