Wed Mar 18 2026 18:00:27 GMT+0530 (India Standard Time)
వివేకా హత్య కేసులో సాక్షి మృతి
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలో ఆయన మృతి చెందారు.

వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలో ఆయన మృతి చెందారు. తనకు ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్సీని కలిశారు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. అయితే ఎలా మృతి చెందాడన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
హత్య తర్వాత...?
వైఎస్ వివేకా హత్య తర్వాత గంగాధర్ రెడ్డి యాడికిలో నివాసముంటున్నారు. సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి తన ఇంట్లోనే మరణించడం అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశాడా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

