Sun Mar 15 2026 15:03:52 GMT+0530 (India Standard Time)
TDP : ఏందయ్యా ఇది.. ఇలా పార్టీ ఓడిపోతుందని ముందే ఫిక్స్ అయితే ఎలా?
విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ సొంత పార్టీ ఓటమి పాలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు

విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ సొంత పార్టీ ఓటమి పాలవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జల్లాలో టీడీపీ కొన్ని స్థానాల్లో ఓడిపోతుందని ఆయన తెలిపారు. విశాఖ జిల్లాలో కొన్ని స్థానాల్లో ఓటమి పాలవుతుందని గండి బాబ్జీ అన్నారు. రెండు, మూడు స్థానాల్లో పార్టీ ఓటమి పాలయ్యే అవకాశముందని గండి బాబ్జీ తెలిపారు.
ఆరింటిలో నాలుగు...
బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్న విశాఖ నార్త్ నియోజకవర్గం కూడా తనకు అనుమానంగానే ఉందని అన్నారు. విశాఖ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమేనని గండి బాబ్జీ అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకపార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు.
Next Story

