Thu Mar 19 2026 02:10:35 GMT+0530 (India Standard Time)
నేడు సాయితేజ అంత్యక్రియలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సాయితేజ భౌతిక కాయాన్ని గుర్తించడంలో ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులకు నేడు ఆర్మీ అధికారులు భౌతిక కాయాన్ని అందించనున్నారు. బెంగళూరులో ఉన్న సాయితేజ భౌతిక కాయాన్ని చిత్తూరు జిల్లా ఎగువరేగడి గ్రామానికి ఆర్మీ అధికారులు తీసుకువస్తారు.
సైనిక లాంఛనాలతో....
సాయితేజ అంత్యక్రియలు ఎగువరేగడి గ్రామంలో ఈరోజు పది గంటలకు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారు. ప్రభుత్వం సాయితేజ కుటుబానికి యాభై లక్షల పరిహారాన్ని ప్రకటించింది. సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story

