Tue Mar 31 2026 07:42:47 GMT+0530 (India Standard Time)
నేడు వైఎస్సార్ కల్యాణమస్తు నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా లబ్దిదారులకు నిధులు విడుదల కానున్నాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కింద లబ్దిదారులకు నిధులు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు లబ్దిదారులకు బటన్ నొక్కి ఆర్థికసాయాన్ని అంద చేయనున్నారు. మొత్తం 4,536 మంది లబ్దిదారులకు ఈ పథకాలను జగన్ అందించనున్నారు.
ఆర్థిక సాయాన్ని...
వీరికి 38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఈ నగదను అంద చ ేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికే ఈ పథకం అందుతుంది. బాల్య వివాహాలను అరికట్టడం, ప్రభుత విద్యాసంస్థల్లో చేరికలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. వివాహమైన నెల రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- Tags
- ys jagan
Next Story

