Thu Mar 19 2026 04:45:08 GMT+0530 (India Standard Time)
నిధులు వచ్చేశాయి.. జగన్ త్వరలో శంకుస్థాపన
బందరు పోర్టు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 3,940 కోట్లు రుణం మంజూరు చేస్తూ పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది

మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. 3,940 కోట్లు రుణం మంజూరు చేస్తూ పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. త్వరలోనే మచిలీ పట్నం పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
చిరకాల వాంఛ...
దీంతో మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పవచ్చు. వంద శాతం రుణం మంజూరు చేయడంతో మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగం అందుకోనున్నాయి. ఏపీలో మేజర్ ప్రాజెక్టు అయిన మచిలీపట్నం పోర్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వంతో పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది.
Next Story

