Sat Mar 21 2026 12:41:18 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం
ఈరోజు నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేయనుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఉచిత రిజిస్ట్రేషన్లీ నేటి నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ అవకాశాన్ని స్థలం దక్కిన పేదలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ రిజిస్ట్రేషన్లను వీఆర్వోలు నిర్వహిస్తారని తెలిపింది.
నేటి నుంచి...
జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమీక్షించాలని ఆదేశించింది. పేదలకు ఇళ్ల పట్టాలను అందించిన తర్వాత దానిని వారి పేరిట ఉచిత రిజిస్ట్రేషన్లు చేయించే కార్యక్రమం చేపట్టింది. తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Next Story

