Thu Mar 19 2026 05:27:07 GMT+0530 (India Standard Time)
Pawan : నేటి నుంచి పవన్ ప్రచారం.. రోజుకు రెండు చోట్ల
నేటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరస పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

నేటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరస పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. తాను పోటీ చేయనున్న పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తర్వాత రాజానగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాజానగరంలోనూ జనసేన అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రాజానగరంలో...
నేటి నుంచి రోజుకు రెండు నియోజవకర్గాల్లో పర్యటించాలని జనసేనాని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన రోడ్డు మ్యాప్ ను పార్టీ కార్యాలయం రూపొందించింది. దీంతో పాటు ఉమ్మడి సభల్లోనూ ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ నెలలోనే ప్రధాని మోదీ ఏపీలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆ సభకు కూడా పవన్ కల్యాణ్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

