Wed Mar 18 2026 13:36:18 GMT+0530 (India Standard Time)
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కోసం పాస్ లు ఇలా పొందాలి
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది.

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది. అయితే ఆర్టీసీ బస్సులో దివ్యాంగులు ప్రయాణించాలంటే పాస్ లు తీసుకోవాల్సి ఉంటుంది. నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'దివ్యాంగ శక్తి' పథకాన్ని ప్రారంభించారు.
బస్ పాస్ కౌంటర్లలో...
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్ పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్లు తీసుకోవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ యాప్, మనమిత్ర యాప్ ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతారు.
Next Story

