మదనపల్లెలో మోసం.. వీడియోలు డబ్బులు వస్తాయంటూ
అది మదనపల్లి. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తిని డబ్బులు ఎలా సంపాదిస్తున్నావ్ అని అడిగితే ఓ యాప్ ఉంది.

అది మదనపల్లి. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తిని డబ్బులు ఎలా సంపాదిస్తున్నావ్ అని అడిగితే ఓ యాప్ ఉంది. ఆ యాప్ లో వీడియోలను చూస్తే చాలు డబ్బులు వస్తాయని చెప్పాడు. అలా ఆ యాప్ లో వీడియోలు చూసిన చాలా మందికి మొదట బాగానే డబ్బులు వచ్చాయి. బహుమతులు కూడా వచ్చాయి. ఈ విషయం తెలిసి చాలా మందే ఆ యాప్ ను వాడడం మొదలుపెట్టారు. చివరికి తాము మోసపోయామని వారంతా గుర్తించారు.
300 మంది బాధితులు మదనపల్లె ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన మోహన్‌బాబు ఏపీ, కర్ణాటకలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారన్నారు. ముందుగా కొంత డబ్బు కట్టి ‘ఆరా’ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని, అందులో వీడియోలు చూస్తే డబ్బులు, బహుమానాలు వస్తాయని నిందితుడు ప్రజలను నమ్మించాడు. 2 వేల రూపాయలతో మొదలుపెట్టి ఆపై ఎంతైనా చెల్లించొచ్చని చెప్పడంతో చాలా మంది డబ్బు కట్టారు. ఓ నెల తర్వాత ఆ యాప్ పని చేయకుండా అయిపొయింది. డబ్బూ యాప్ నుంచి తీసుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

