Thu Jan 22 2026 07:17:18 GMT+0000 (Coordinated Universal Time)
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సస్పెండ్ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈ నెల 25వ తేదీ వరకూ నలుగురు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణలను స్పీకర్ నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
నాలుగు రోజుల పాటు.....
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. కల్లీ సారా ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా వారు వినకుండా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తుండటంతో నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Next Story

