Sat Jan 31 2026 09:16:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సం నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పార్టీని జగన్ ప్రకటించి పదకొండేళ్లు పూర్తి కావస్తుంది

వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సం నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పార్టీని జగన్ ప్రకటించి పదకొండేళ్లు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాల్లో పెద్దయెత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేయనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్య నేతలు వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అధికారంలోకి తీసుకువచ్చి...
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ 2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం ఓదార్పు యాత్ర, పాదయాత్రతో ప్రజల వద్దకు వెళ్లారు. 2014 ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయిన వైసీపీ, 2019 లో మాత్రం తన టార్గెట్ రీచ్ అయింది. తనపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను జగన్ నామరూపాలు లేకుండా చేశారు. ఈరోజు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story

