Thu Jan 29 2026 16:30:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఊరట
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఊరట లభించింది

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసులో తమను ముందస్తు అరెస్ట్ చేయవద్దంటూ పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు వెళ్లినా పిటీషన్ ను తిరస్కరించడంతో పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తమపై రాజకీయ కక్ష కారణంగానే ఈ కేసు నమోదు చేశారని పిటీషన్ లో పేర్కొన్నారు.
అరెస్ట్ చేయకుండా...
ఆ హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆధారాలే లేకుండా తమను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో టీడీపీ నేతల హత్య కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Next Story

