Sun Dec 08 2024 09:43:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నందిగం సురేష్ బెయిల్ పై తీర్పు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో తీర్పు చెప్పనుంది
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో తీర్పు చెప్పనుంది. ఈ తీర్పు కోసం వైసీపీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నందిగం సురేష్ ఒక మహిళ హత్య కేసులో నిందితుడిగా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
మహిళ హత్య కేసులో...
నేడు నందిగం సురేష్ కు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది తేలిపోనుంది. బెయిల్ ఇవ్వవద్దంటూ ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించారు. కానీ హత్యా నేరం కావాలని మోపారని, మహిళ హత్య కేసులో నందిగం సురేష్ ప్రమేయం ఏమీ లేదని ఆయన తరుపున న్యాయవాదులు వాదించారు. దీంతో ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
Next Story