Sun Dec 08 2024 08:38:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నందిగం సురేష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఎదురు దెబ్బతగలింది.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఎదురు దెబ్బతగలింది. నందిగం బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటీషన్ పై కొద్దిసేపటి క్రితం హైకోర్టులో తీర్పు వెలువరించింది. నందిగం సురేష్ మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
మహిళ హత్య కేసులో...
నేడు నందిగం సురేష్ కు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది తేలిపోయింది. బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పు కోసం వైసీపీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే చివరకు హైకోర్టు తీర్పుతో నందిగం సురేష్ కు హైకోర్టులో చుక్కెదురయింది.
Next Story