Sat Mar 07 2026 10:10:08 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి ఆమంచి రాజీనామా
. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. తాను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేేేసే అవకాశం లభించలేదు. జగన్ పార్టీ నుంచి టిక్కెట్ దక్కకపోవడంతో గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ నేడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
చీరాల నియోజకవర్గం నుంచి..
ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గతంలో గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అనంతరం టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అయితే తాను ఈ నెల9వ తేదీన తన మద్దతుదారులతో సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు.
Next Story

