Fri Oct 11 2024 08:16:30 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి కిల్లికి అవమానం
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి అవమానం జరిగింది. సీఎం పర్యటన సందర్భంగా ఆమెను అనుమతించక పోవడంతో వెనుదిరిగారు
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి అవమానం జరిగింది. సీఎం పర్యటన సందర్భంగా ఆమెను అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా మొన్నటి వరకూ పనిచేశారు. అయితే సీఎం సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
బుజ్జగించినా..
దీంతో కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోబోయారు. తనను సీఎం పర్యటన సందర్భంగా అవమానించారని ఆమె వెళ్లిపోతుండగా ధర్మాన కృష్ణదాస్ అనుచరులు బుజ్జగించారు. అయినా ఆమె వినలేదు. సీఎం కార్యక్రమం జరిగే చోట నుంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Next Story