Fri Dec 05 2025 13:49:48 GMT+0000 (Coordinated Universal Time)
రాజుగారికి రిలీఫ్
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పై నమోదయిన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు సూచించింది. ఇటీవల రామతీర్థం ఆలయంలో అశోక్ గజపతిరాజు తన విధులకు భంగం కల్గించారని ఈవో చేసిన ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదయింది. మంత్రులతో కూడా వాగ్వాదం దిగడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
తదుపరి చర్యలు...
నెలిమర్ల పోలీసులు అశోక్ గజపతిరాజును నోటీసులు పంపారు. కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ చేసిన అనంతరం అశోక్ గజపతిరాజుపై తదుపరి చర్యలు నిలిపి వేయాలని ఆదేశించింది.
Next Story

