Fri Mar 20 2026 11:29:35 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై భూమన కీలక వ్యాఖ్యలు
తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు

తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. స్వామివారి ప్రసాదంపై అపవాదు వేశారన్నారు.ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు తిరుమల లడ్డూపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పూ జరగలేదని తెలిపారు.
లడ్డూ వివాదంపై...
తాము లడ్డూ వివాదంపైధైర్యంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని చెప్పారు.మాజీ సీఎంను తిరుమల రాకుండా అడ్డుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రోజుకు 700 మంది అన్యమతస్తులు తిరుమలకు వస్తారని, తాము ఏనాడూ డిక్లరేషన్ తీసుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story

