Fri Apr 03 2026 14:07:32 GMT+0530 (India Standard Time)
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి వైసీపీలో చేరారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి వైసీపీలో చేరారు. ఆమె కొద్ది నెలల క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాలో శోభా హైమావతి గతంలో టీడీపీకి కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. అయితే తెలుగుదేశం 2014లో అధికారంలోకి వచ్చినా ఆమెకు గుర్తింపు లభించలేదు.
కొద్దిరోజుల క్రితం....
దీంతో కొద్ది రోజుల క్రితం శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. తాను జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని శోభాహైమావతి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
Next Story

