Sun Mar 15 2026 16:39:00 GMT+0530 (India Standard Time)
నాపై ఒత్తిడి మాట నిజమే : ప్రభాకర్ చౌదరి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం అర్భన్లో టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని ఆయన తెలిపారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో కేడర్ తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు. టీకెట్ కోసం ఎవరైనా ప్రయత్నం చేయవచ్చని ప్రభాకర్ చౌదరి అన్నారు.
వారిని ఏమీ అనొద్దు...
టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవారిని ఏమీ అనొద్దు అని ఆయన తన అనుచరులకు పిలుపు నిచ్చారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేద్దామని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. కాగా అనంతపురం అర్బన్ స్థానాన్ని ఇంత వరకూ ప్రకటించలేదు. దానిని బీజేపీకి కేటాయించే అవకాశాలున్నాయని తెలిసింది.
Next Story

