Sat Mar 07 2026 23:00:50 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీకి సోమేష్ కుమార్
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటీరీ సోమేష్ కుమార్ నేడు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయనున్నారు

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటీరీ సోమేష్ కుమార్ నేడు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయనున్నారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఆయన ఈరోజు ఏపీలో రిపోర్టు చేయనున్నారు. ఇందుకోసం సోమేష్ కుమార్ విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఉదయం పది గంటలకు ఆయన చీఫ్ సెక్రటరీ వద్ద రిపోర్టు చేస్తారని తెలిసింది.
డీవోపీటీ ఆదేశాలతో...
అనంతరం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశముంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన ఏపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన డిసెంబరు వరకూ పదవీకాలంలో ఉండనున్నారు. జాయిన్ అయి సెలవులో వస్తారా? లేక ఏపీలో ఏదైనా పోస్టులో జాయిన్ అవుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

