Fri Dec 05 2025 20:52:52 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
టెక్కలి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. జగన్ బస్సు యాత్రలో నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్నారు. జగన్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. గత నెల 27న ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమయిన నాటి నుంచి చేరికలు ప్రతిరోజూ కొనసాగుతున్నాయి. ఇతర పార్టీలో టిక్కెట్లు దక్కని వారు, అసంతృప్తి చెందుతున్న వారు వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేరి ఎన్నికల సమయంలో తాము విజయంలో కీలక భూమిక పోషిస్తున్నామని చెబుతున్నారు.
సిక్కోలుకు చేరుకున్న తరుణంలో...
ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోకి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. అయితే ఈ సందర్భంగా టెక్కలి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి వైసీపీలో చేరారు. తాను టెక్కలిలో వైసీపీ విజయానికి కృషి చేస్తానని భారతి తెలిపారు. జగన్ భారతికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, టెక్కలిలో దువ్వాడ విజయానికి కృషిచేయాలని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. పాతపట్నం నియోజకవర్గం నేతలు లోలుగు లక్ష్మణరావు కొయ్యాన శ్రీవాణిలు పార్టీలు చేరారు.
Next Story

