Wed Mar 18 2026 06:45:23 GMT+0530 (India Standard Time)
చూస్తుంటే .. బెజవాడకు మళ్లీ పాతరోజులొచ్చేటట్లే ఉంది
వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు

వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. చూస్తుంటే మళ్లీ బెజవాడకు పాతరోజులు వచ్చేటట్లే కన్పిస్తుందన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ బెజవాడలో మొదలవుతాయేమోనన్న ఆందోళనను బుద్దా వెంకన్న వ్యక్తం చేవారు. వైసీపీ నేతలు ఈ రెక్కీ వెనక ఉన్నారని ఆయన ఆరోపించారు.
వరస సంఘటనలు.....
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిమీద దాడి దగ్గర నుంచి టీడీపీ కార్యాలయపై జరిగిన విధ్వంసం అనునామానాలకు తావిస్తుందన్నారు. వంగవీటి రాధా ఎవరి జోలికి వెళ్లేవారు కాదని, అటువంటి నేత హత్యకు కుట్ర జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story

