Sun Mar 15 2026 10:19:00 GMT+0530 (India Standard Time)
TDP : టీడీపీకి చెంగల్రాయుడు గుడ్ బై
టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజీనామా చేశారు.

టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు రాజీనామా చేశారు.కడప జిల్లా రాజంపేట లో తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడుఈ నిర్ణయం తీసుకున్నారు. బత్యాల చెంగల్రాయుడు రాజంపేట టీడీపీ టిక్కెట్ ను ఆశించారు. అయితే ఆ టిక్కెట్ తనకు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బత్యాల చెంగల్రాయుడు పార్టీ పదవులుకు, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టిక్కెట్ రానందుకు...
నిన్న విడుదల చేసిన జాబితాలో టీడీపీ అధినాయకత్వం సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాజంపేటలో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. బత్యాల చెంగల్రాయుడు అనుచరులు టీడీపీ జెండాలు తగులపెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. చంద్రబాబు తమ నేతను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story

