Wed Feb 04 2026 07:33:51 GMT+0000 (Coordinated Universal Time)
సీఐడీ ఒక గాసిప్ ఏజెన్సీ : దూళిపాళ్ల
ఏపీ సీఐడీ ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు

ఏపీ సీఐడీ ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలెప్మెంట్ కేసు బోగస్ అని తేలిపోయిందన్నారు. చంద్రబాబును జైలుకు పంపి యాభై రోజులు గడుస్తున్నా ఆయనకు గాని, ఆయన కుటుంబానికి కానీ ఇక్క రూపాయి అవినీతి సొమ్ము అందినట్లు సీఐడీ రుజువు చేయలేకపోయిందని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు.
బట్టలు విప్పి...
టీడీపీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించిన సొమ్మును అవినీతి సొమ్ముగా చూపేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కార్యకర్తలు పార్టీ కోసం అందించే ప్రతి రూపాయి పారదర్శకంగా ఉంచుతామని, కార్యకర్తలు, పార్టీకి మధ్య జరిగే చెల్లింపులు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు తెలియపరుస్తామని ఆయన అన్నారు. అధికార మదంతో వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న ధూళిపాళ్ల, వైసీపీ నేతలను ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు ఎంతో దూరం లేదన్నారు.
Next Story

