Sun Mar 15 2026 09:33:31 GMT+0530 (India Standard Time)
Tadipathri : నన్ను హత్య చేయడానికి కుట్ర : పెద్దారెడ్డి
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలసి తన హత్యకు పథకాలు రచించారని కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. తనపై ఇప్పటికి మూడుసార్లు హత్యాయత్నం జరిగిందని ఆయన తెలిపారు.
తాడిపత్రిలోకి...
తన సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని కూడా గతంలో ఇదే మాదిరిగా కుట్ర చేసి హత్య చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తనను తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వడం లేదన్నారు. తాను పోలీసుల అనుమతి తీసుకున్నా శాంతి భద్రతలత పేరుతో అడ్డుకుంటున్నారని, తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.
Next Story

