Sun Mar 15 2026 11:13:17 GMT+0530 (India Standard Time)
పొత్తులతో ఇబ్బందులే.. జేసీ కామెంట్స్
తమ కుటుంబం నుంచి రెండు సీట్లు అడిగామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు

తమ కుటుంబం నుంచి రెండు సీట్లు అడిగామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు తమ కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామని చెప్పలేదని కూడా ఆయన అన్నారు. ఇతర కుటుంబాలకు మాత్రం ఒక టిక్కెట్ అని చెప్పిన చంద్రబాబు తమ విషయంలో అలా అనలేదని ఆయన అన్నారు.
పొత్తులతో ఇబ్బందులే...
పొత్తుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి, దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం ఎంపీ టిక్కెట్ అడిగామని తెలిపారు. రెండు టిక్కెట్లు ఇస్తామని కాని, ఇవ్వబోమని కాని చంద్రబాబు తమతో అనలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Next Story

