Sun Mar 15 2026 05:36:00 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి నేడు వేమిరెడ్డి రాజీనామా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేడు మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేడు మాజీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఆయనను వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమించిన తర్వాత తాను సూచించిన వారికే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి షరతు పెట్టారు. అయితే దీనికి వైసీపీ అధినాయకత్వం అంగీకరించకపోవడంతో ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
టీడీపీ నుంచే...
దీంతో ఆయన ఈరోజు వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాజీనామా సమర్పించిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో చర్చించి టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో ఉంటారన్న టాక్ వినపడుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తుండటం వైసీపీకి షాక్ అని చెప్పాల్సి ఉంటుంది.
Next Story

