Sat Mar 07 2026 23:47:48 GMT+0530 (India Standard Time)
నాకు షోకాజ్ నోటీసా... హ్హ..హ్హ...హ్హ
సోము వీర్రాజు షోకాజ్ నోటీస్ కు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పందించారు.

సోము వీర్రాజు షోకాజ్ కు మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పందించారు. తన కుటుంబ సభ్యులు టీడీపీలో ఉన్నారని, అది అందరికీ తెలుసునని టీజీ అన్నారు. కొత్తగా సోము వీర్రాజు నోటీస్ ఇచ్చేది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం హాస్యాస్పదమని టీజీ వెంకటేష్ కొట్టిపారేశారు.
మరి దగ్గుబాటి సంగతేంటో?
అలాగయితే దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ నుండి పోటీ చేసిందని, దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీ నుండి పోటీ చేశారన్న విషయాన్ని టీజీ వెంకటేష్ గుర్తు చేేశారు. దగ్గుబాటి పురంధరేశ్వరికి ఒక న్యాయం, తనకో న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులకు భయపడేది లేదని వెంకటేష్ అన్నారు.
Next Story

