Thu Mar 19 2026 03:01:07 GMT+0530 (India Standard Time)
ఎప్పటికీ రాజధాని అమరావతే
అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఎప్పటికీ ఉంటుందని మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు.

అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఎప్పటికీ ఉంటుందని మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వైసీపీ ప్రభుత్వం వల్ల కాదని ఆయన అన్నారు. తమ హక్కుల కోసం రైతులు చేపడుతున్న పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని సుజనా చౌదరి తెలిపారు.
బీజేపీ మద్దతు...
అయితే అమరావతిపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని సుజనా చౌదరి తెలిపారు. వైసీపీ నేతలు రోజుకోమాట చెబుతున్నారని, వారిని ప్రజలు విశ్వసించరని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలు అమరావతిని రాజధానిగా అంగీకరించారని, బీజేపీ కూడా అందుకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
Next Story

