Fri Dec 05 2025 17:50:32 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును మెచ్చుకున్న రఘువీరారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మడకశిర పర్యటనపై కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటం లేకుండా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు.
మడకశిర సమస్యలను...
బలవంతపు జన సమీకరణ చేయకుండా ప్రజలతో నేరుగా మాట్లాడటం గొప్పవిషయమని రఘువీరారెడ్డి అన్నారు. పదేళ్లుగా మడకశిర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాకరని, వాటిని పరిష్కరించే మంచి అవకాశం ఆ దేవుడు చంద్రబాబుకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ఆయన వీడియో విడుదల చేశారు.
Next Story

