Sun Mar 15 2026 08:47:13 GMT+0530 (India Standard Time)
జగన్, చంద్రబాబు ఇద్దరూ కొట్టుకుంటుంటే?
ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇప్పటికైనా రాష్ట్ర నేతలు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ విభజనపై ఇప్పటికైనా రాష్ట్ర నేతలు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపక పోవడం అన్యాయమని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ కలసి కొట్టుకుంటూ ఏపీకి అన్యాయం చేస్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.
లోక్ సభలో....
ఏపీకి అన్యాయం జరిగిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్లమెంటులో అంగీకరించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలన్నారు. లోక్ సభలో విభజనతో ఏపీకి జరిగిన అన్యాయంపై వైసీపీ ఎంపీలు లోక్ సభలో చర్చకు డిమాండ్ చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. విభజనతో అన్యాయం జరిగిన ఏపీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలవాలన్నారు. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకుని పోవాలని ఉండవల్లి అన్నారు.
Next Story

