Sat Dec 06 2025 01:13:08 GMT+0000 (Coordinated Universal Time)
ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తా
అధిష్టానం ఆదేశం మేరకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు

అధిష్టానం ఆదేశం మేరకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అధిష్టానం నిర్ణయం మేరకే నడచుకుంటానని చెప్పారు. గోనెగండ్ల మండలం గంజహళ్లి బడే సాహెబ్ దర్గాను బుట్టా రేణుక దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
ఎమ్మెల్యే కంటే...
ఈసందర్భంగా బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం జరగడంపై ఆమె స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తెలిపారు. తనకు ఎమ్మెల్యే కంటే ఎంపీగానే పోటీ చేయడం ఇష్టమని ఆమె చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయమన్నారు.
Next Story

