Sat Apr 04 2026 07:29:05 GMT+0530 (India Standard Time)
బీసీ నేత ఐలాపురం వెంకయ్య మృతి
మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతి చెందారు

ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య కన్నుమూశారు. విజయవాడలో ఆయన హోటల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఒకప్పుడు ఐలాపురం హోటల్ అంటే స్టార్ హోటల్ తరహాలో అందరికీ ఆతిధ్యమిచ్చేది. కుండ బిర్యానీతో విజయవాడ నగరవాసులనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ఆహార ప్రియులను ఆకట్టుకున్నారు.
రాజకీయ వర్గాల్లో...
ఐలాపురం వెంకయ్య మరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ప్రజల సమస్యల పరిష్కారంలో, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన కుమారుడు, మాజీ సమాచార కమిషనర్ రాజా అన్ని రాజకీయ పార్టీల నేతలకు సుపరిచితులు. సౌమ్య స్వభావం, అతిథి సత్కారం, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
Next Story

