Fri Dec 05 2025 18:26:55 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ పని ఫినిష్ అయినట్లే
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాగానే జగన్ మళ్లీ కేంద్ర ప్రభుత్వం వద్దకు పరుగులు తీశారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాగానే జగన్ మళ్లీ కేంద్ర ప్రభుత్వం వద్దకు పరుగులు తీశారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమయిపోయిందన్న బుద్దా వెంకన్న వైసీపీ ఓటమి కోసం ఎదురు చూడటం తప్ప మరేమీ చేయలేదన్నారు.
పీవీకి భారత రత్న వస్తే....
కనీసం ఢిల్లీలో పీవీ నరసింహారావుకు భారత రత్న వస్తే స్పందించాల్సిన గుణం కూడా జగన్ కు లేదన్నారు. మీడియా వాళ్లు అడిగినా విజయసాయిరెడ్డి స్పందిస్తారని చెప్పి వెళ్లడం పీవీని అవమానించడమేనని ఆయన అన్నారు. వైసీపీ పని ఫినిష్ అయిపోయిందన్న బుద్దా వెంకన్న ప్రజలు కూడా టీడీపీ, జనసేన కూటమిని గెలిపించేందుకు సిద్దమయ్యారన్నారు. ఏం ప్రయత్నాలు చేసినా ఇక కుదిరే పని కాదని చెప్పారు.
Next Story

